రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు భాగంగా ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో ఆటోలను ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయడం వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని సీఐ భాస్కర్ హెచ్చరిస్తూ, నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లోనే ఆటోలను నిలపాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఆటోలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాల కేటాయింపుపై మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. రద్దీ ప్రాంతాల్లో ఆటోల నిలిపివేతపై పోలీస్ హెచ్చరికలు ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణను మరింత పటిష్ఠం చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు.
ముఖ్యంగా ప్రధాన రహదారులు, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆటోలను ఇష్టారాజ్యంగా నిలిపివేయడం వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను అరికట్టేందుకు మంగళవారం ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, పార్కింగ్ నియమాలు, ప్రయాణికుల పట్ల ప్రవర్తన వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి