రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పట్టణ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు “ప్రజలతో కమిషనర్‌తో ముఖాముఖి” ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని 10.08.2026 నుంచి ప్రారంభిస్తోంది. 9247563385, 9849905863 నంబర్లకు కాల్ చేసి దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, దూరాభార ప్రాంతాల ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని, ఇవి అదే రోజు సంబంధిత శాఖలకు పంపి కమిషనర్ స్వయంగా పురోగత
ప్రతి సోమవారం ‘ప్రొద్దుటూరు కమిషనర్‌తో ముఖాముఖి’ ఫోన్ ఇన్ ప్రొద్దుటూరు: పట్టణ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “ప్రజలతో కమిషనర్ తో ముఖాముఖి” పేరుతో ప్రతి సోమవారం ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
ఈ ప్రత్యేక కార్యక్రమం 10.08.2026 సోమవారం నుండి అమల్లోకి రానుంది. ప్రతి సోమవారం ఉదయం 9.00 గంటల నుండి 10.00 గంటల వరకు ఒక గంటపాటు ఈ ఫోన్ ఇన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి