రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరులో కాంగ్రెస్ శ్రేణులు స్థానిక ఎన్నికల దృష్ట్యా చురుకుగా కదులుతున్న నేపథ్యంలో 11వ వార్డు పరిధిలో ఎస్. మహబూబ్ బాషాతో పాటు 40 కుటుంబాలు కడప డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి.
విజయజ్యోతి సమక్షంలో పార్టీలో చేరారు. పట్టణ అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రస్తుత పాలకులు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి వ్యాపార ప్రయోజనాల కోసం పాలన సాగించారని ఇర్ఫాన్ బాషా, విజయజ్యోతి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.
ప్రొద్దుటూరు లో కాంగ్రెస్‌కు ఊపు: 40 కుటుంబాల చేరిక వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలకు పోటీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి