రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవ ప్రారంభం

ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన సేవలను వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షిత, సౌకర్యవంతమైన రవాణా కల్పించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం ఈ సేవల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

ముఖ్యంగా పేద, గ్రామీణ ప్రాంతాల కుటుంబాలు ఈ సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని వైద్యులు సూచించారు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవ ప్రారంభం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన సేవలను గౌరవ శాసన సభ్యులు వరదరాజుల రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా రవాణా సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భవతులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకొని, ఇక్కడే ప్రసవం జరగేలా చూడాలని వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →