రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్యానెల్ స్పీకర్‌గా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గురువారం సభాపతి స్థానంలో నుంచి సభా కార్యక్రమాలను నిర్వహించడం ప్రొద్దుటూరు నియోజకవర్గ చరిత్రలో తొలి ఘట్టంగా నిలిచింది. వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ఈ గౌరవం దక్కడంతో స్థానిక ప్రజలు, Telugu Desam Party శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ, నియోజకవర్గానికి ఇది ప్రత్యేక మైలురాయిగా భావిస్తున్నారు.
సభాపతి స్థానంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అరుదైన, గర్వకారణమైన ఘట్టం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి, శాసనసభ స్పీకర్ స్థానంలో ఆసీనులయ్యే అవకాశం పొందారు.
అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్‌గా ఆయనకు బాధ్యతలు అప్పగించగా, గురువారం జరిగిన సభా కార్యక్రమాలను సభాపతి స్థానంలో నుంచే నిర్వహించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ చరిత్రలో ఇలాంటి అవకాశం ఇదే మొదటిసారి లభించడం విశేషంగా మారింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి