రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కొత్త కమిషనర్ విశ్వనాథ్ చర్యలు చర్చనీయాంశం

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కొత్త కమిషనర్ తుదిక శ్రీనివాస్ విశ్వనాథ్ అవినీతి, అక్రమాలపై కఠిన చర్యలు ప్రారంభించడంతో స్థానికంగా చర్చనీయాంశమయ్యారు. వైసీపీ నాయకులు వెల్లడించిన ఆరోపణల నేపథ్యంలో ఆర్ఐ రమేష్‌ను డిప్రమోట్ చేయడం సహా తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగుల్లో అప్రమత్తత పెంచగా, ప్రజలు మున్సిపాలిటీ పనితీరు, నగర అభివృద్ధిలో మార్పు వస్తుందా అన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కొత్త కమిషనర్ విశ్వనాథ్ చర్యలు చర్చనీయాంశం కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ తుదిక శ్రీనివాస్ విశ్వనాథ్ తీసుకుంటున్న నిర్ణయాలు స్థానికంగా విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యానికి కేంద్రంగా నిలిచిందన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఈ మున్సిపాలిటీ వ్యవస్థలో మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయనే అభిప్రా

మాజీ కమిషనర్ రవిచంద్రారెడ్డి హయాంలో ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం, అధికారుల కనుసన్నల్లో సాగిన అరాచకాలు, కుంభకోణాలు మున్సిపాలిటీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని నగరంలో విమర్శలు వినిపిస్తున్నాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →