రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవుట్‌సోర్సింగ్ లో లక్షల కుంభకోణం

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఫేక్ కాంట్రాక్టర్ బంగారు, ఒక ఏఈ, కంప్యూటర్ ఆపరేటర్ కలిసి గుంతల పనులు, కుళాయి కనెక్షన్లు, టెండర్ల కేటాయింపుల్లో లక్షల రూపాయల అవినీతి చేస్తున్నారన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. కొత్త కమిషనర్ తోదిక శ్రీనివాస్ విశ్వనాథ్ బాధ్యతలు స్వీకరించడంతో ఈ అవినీతి మూకలపై కఠిన చర్యలు తీసుకుంటారా అన్నది ప్రజల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవుట్‌సోర్సింగ్ లో లక్షల కుంభకోణం ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి, అవ్యవస్థలు బహిరంగ రహస్యంగా మారిపోయాయని స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరుగుతున్న గుంతల పనులు, కుళాయి కనెక్షన్ల మంజూరు, టెండర్ల కేటాయింపుల చుట్టూ లక్షల రూపాయల కుంభకోణం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మున్సిపల్ పాలనలో పారదర్శకత రావాలని, సామాన్యులకు సేవలు సక్రమంగా అందాలని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో, కొందరు కింది స్థాయి ఉద్యోగుల ఆగడాలు వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇద్దరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల బాధ్యతలు కొత్తగా కుళాయి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి, ప్రధాన పైప్‌లైన్ నుంచి కనెక్షన్ ఇ

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →