రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు పేరుతో వేదికలపై హామీలు ఇస్తున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తూతీక శ్రీనివాస్ విశ్వనాథ్ పట్టణంలో ప్రభుత్వ పరంబోకు భూమిపై అనుమతుల్లేకుండా నడుస్తున్న ప్లాస్టిక్ ఖాళీ వాటర్ బాటిళ్ల యూనిట్‌పై మాత్రం చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అవసరమైన కాలుష్య నియంత్రణ, మున్సిపల్, పన్ను, భద్రతా అనుమతులేమీ లేకుండా యూనిట్ నడుస్తుండగా, అధికారులు
ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు మాటలేనా? అక్రమ ఖాళీ బాటిళ్ల యూనిట్‌పై అధికారుల మౌనం ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును సాధిస్తామని వేదికలపై ఘనంగా ప్రకటిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరోవైపు పట్టణంలోనే నడుస్తున్న అక్రమ ప్లాస్టిక్ ఖాళీ వాటర్ బాటిళ్ల తయారీ కేంద్రంపై మాత్రం చర్యలు తీసుకోకపోవడం స్థానికుల్లో ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
ఆగస్టు 15 వేడుకల సందర్భంగా ప్రొద్దుటూరులో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తూతీక శ్రీనివాస్ విశ్వనాథ్ ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును నిర్మించేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రజల ముందు ప్రమాణాలు చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి