రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా ప్రొద్దుటూరులో చిన్నపాటి వర్షం పడినా ప్రధాన రహదారులు చెరువుల్లా నీటమునిగిపోవడం స్థానికులకు తలనొప్పిగా మారింది. వైఎంఆర్ కాలనీ సహా పలుచోట్ల మున్సిపల్ కాలువలపై శాశ్వత అక్రమ కట్టడాలు, పూడికలు తొలగించకపోవడం వల్ల పారిశుద్ధ పనులు సక్రమంగా సాగడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కొత్త కమిషనర్ Thodika Srinivas Vishwanath ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి సమస్యను పరిష్కరిస్తారా అన్నది ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ప్రొద్దుటూరు లో కాలువలపై అక్రమ కట్టడాలే కారణమా?
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వర్షాకాలం మొదలైనప్పుడల్లా పాత సమస్యలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. శాంతిభద్రతల పరంగా, వ్యాపార పరంగా ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ పట్టణంలో చిన్నపాటి వర్షం పడినా ప్రధాన రహదారులు చెరువులను తలపించేలా నీటమునిగిపోతున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి