రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అన్యాయాలు, అవమానకర ప్రవర్తన, రక్షణ పరికరాల లేమి, కాంట్రాక్టర్ల దోపిడీతో దుస్థితిలో ఉన్నారని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. శానిటరీ ఇన్స్పెక్టర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్టర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసి, కనీస వేతనాలు, రక్షణ పరికరాలు, సంక్షేమ వసతులు వెంటనే కల్పించాలని మున్సిపల్ కమిషనర్‌ను వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల దుస్థితి కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులపై జరుగుతున్న అన్యాయాలు, వేధింపులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి కనీస మానవత్వానికే సవాలు విసిరే స్థాయికి చేరిందని స్థానిక ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పట్టణ ప్రజల రోజువారీ జీవితంలో ఉత్పత్తి అయ్యే చెత్త, మురుగు, పెంటను తెల్లవారుజామునే శుభ్రం చేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే ఈ శ్రమజీవులు, తమ జీవితాలు మాత్రం మురికి కాలువల్లోనే మగ్గిపోతున్నాయనే వేదన వ్యక్తమవుతోంది. తెల్లవారుజామున 5 గంటలకే విధుల్లోకి దిగే ఈ కార్మికులు, రోజంతా చెత్త, మురుగుతో పోరాడుతూ పనిచేస్తున్నా, వారి జీవన ప్రమాణాలు మాత్రం బుగ్గిపాలవుతున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి