రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్

ఆస్తి మ్యుటేషన్ ప్రక్రియలో మార్పులు – రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమాని పేరు మార్పు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో ఆస్తులు కొనుగోలు చేసే వారికి మ్యుటేషన్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. ఇకపై రిజిస్ట్రేషన్ సమయంలోనే మున్సిపల్ రికార్డుల్లో యజమాని పేరు మార్పు జరిగేలా వ్యవస్థలను అనుసంధానం చేసి, అదే సమయంలో మ్యుటేషన్ ఫీజు వసూలు చేయడానికి చట్ట సవరణలు చేసి, రాష్ట్ర శాసన సభ ఆమోదం తెలిపింది.

ఆస్తి మ్యుటేషన్ ప్రక్రియలో మార్పులు – రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమాని పేరు మార్పు ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో ఆస్తులు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆస్తి రిజిస్ట్రేషన్ అనంతరం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగి మ్యుటేషన్ కోసం విడిగా దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేకుండా మార్పులు చేసింది.

ఈ మేరకు చట్ట సవరణలకు ఏపీ శాసన సభ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు మున్సిపాల్టీ, కార్పొరేషన్ పరిధిలో ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ పూర్తయిన అనంతరం యజమాని పేరు మున్సిపాల్టీ రికార్డుల్లో మార్పు చేయించుకోవాలంటే ప్రత్యేకంగా మ్యుటేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →