రాయలసీమ న్యూస్ - కర్నూలు
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు నగర అభివృద్ధి పనులన్నీ ప్రజా సౌలభ్యాన్ని కేంద్రబిందువుగా తీసుకుని, నాణ్యతా ప్రమాణాలతో, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వినాయకఘాట్ వద్ద సీసీ రహదారి, అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన ఆయన, రూ.88.06 కోట్లతో మౌలిక వసతుల పనులు చేపట్టి, గణేష్ నిమజ్జనం సమయంలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ప్రజా సౌలభ్యమే పనులకు ప్రమాణం : కమిషనర్ చల్లా ఓబులేసు నగరంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిలో ప్రజా సౌలభ్యాన్ని కేంద్రబిందువుగా తీసుకుని ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి పనిలో ప్రణాళికతో పాటు నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం కమిషనర్ చల్లా ఓబులేసు వినాయకఘాట్ వద్ద రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారిని పరిశీలించారు. రహదారి నిర్మాణ నాణ్యత, వినియోగ సౌలభ్యం, ప్రజలకు కలిగే ప్రయోజనాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి