రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కోవిడ్ సమయంలో నిలిపివేసిన గుర్తింపు పొందిన జర్నలిస్టుల రైల్వే ప్రయాణ రాయితీని తక్షణమే పునరుద్ధరించాలని కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 1950ల నుంచి అమల్లో ఉన్న ఈ సౌకర్యం జర్నలిస్టుల వృత్తి నిర్వహణ, ఆర్థిక సంక్షేమానికి కీలకమని, రైలు సర్వీసులు సాధారణ స్థితికి వచ్చిన నేపథ్యంలో కన్సెషన్‌ను తిరిగి అమలు చేయాలని ఆయన కోరారు.
గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైల్వే ప్రయాణ రాయితీ పునరుద్ధరించాలి: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ ప్రొద్దుటూరు (కడప): రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జర్నలిస్టులకు గతంలో అమల్లో ఉన్న రైల్వే ప్రయాణ రాయితీ సదుపాయాన్ని తక్షణమే పునరుద్ధరించాలని కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన ఒక అధికారిక లేఖ పంపి
కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల ప్రయాణ రాయితీని దేశవ్యాప్తంగా సాధారణ రైలు సర్వీసులు పునరుద్ధరించినప్పటికీ ఇప్పటివరకు తిరిగి అమల్లోకి తీసుకురాకపోవడం విచారకరమని ఎంపీ అవినాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి నిర్వహణకు ఈ రాయితీ కీలకమని ఆయన లేఖలో స్పష్టం చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి