రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల ఫస్ట్ బ్రాంచ్ ఆర్ఐ మహబూబ్ బాషా ప్రవర్తనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థులకు 17 వేల రూపాయల ఫీజు బకాయి పేరుతో టీసీలు ఇవ్వకుండా ఆలస్యం చేయడం, ఏడు సంవత్సరాలు పనిచేసిన ఉపాధ్యాయుడు భద్రయ్యకు రెండు నెలలుగా జీతం ఇవ్వకపోవడం పై యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
పేద విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఫీజు సమస్యను మానవత్వంతో పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. రాయచోటి శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆర్ఐపై ఆరోపణలు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల ఫస్ట్ బ్రాంచ్ ఆర్ఐ మహబూబ్ బాషా ప్రవర్తనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడని, పేద విద్యార్థులపై అన్యాయం చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు ఇప్పటివరకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా, వారి పేర్లపై 17 వేల రూపాయలు బకాయిలు ఉన్నాయని యాజమాన్యం పట్టుబడుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి