రాయలసీమ న్యూస్ - తిరుపతి
రేణిగుంట సమీపంలోని గాజులమండ్యం వద్ద ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గర ఆదివారం ఆటో, కారు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
కారు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటూ, కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. రేణిగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం… ఆటోలో ప్రయాణిస్తున్న కుటుంబానికి తీవ్ర గాయాలు రేణిగుంట: రేణిగుంట పరిధిలోని గాజులమండ్యం సమీపంలో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
పుత్తూరు వైపు వెళ్తున్న ఓ ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టిన ఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… పుత్తూరు దిశగా ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు అధిక వేగంతో ఢీకొట్టింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి