రాయలసీమ న్యూస్ క్రైమ్ డెస్క్
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఆమె స్కూల్‌లోనే చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులే నిందితులని పోలీసులు నిర్ధారించారు. గంజాయి మత్తు, జల్సాల కోసం డబ్బు అవసరం నేపథ్యంలో రూపారెడ్డి ఇంట్లో చోరీ చేయాలని పథకం వేసి, ఆమెను ఇంట్లోనే 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేసి, రూ.2 లక్షలు దోచుకుని Hyderabadలో జల్సాలు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.
రూపారెడ్డి హత్య కేసు: ఇద్దరు పదో తరగతి విద్యార్థులే నిందితులు నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి లోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును విచారించిన పోలీసులు, పాఠాలు చెప్పే గురువునే ఆమె స్కూల్‌లో చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు కత్తితో పొడిచి హత్య చేసినట్లు నిర్ధారించారు.
పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం, ఈ ఇద్దరు విద్యార్థులు గంజాయి వంటి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. రోజురోజుకూ పెరుగుతున్న ఈ వ్యసనాలు, జల్సాల కోసం అవసరమైన డబ్బు కొరత కారణంగా, తమ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంట్లో చోరీ చేయాలని నిందితులు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి