రాయలసీమ న్యూస్ - అనంతపురం
రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రాష్ట్ర అసెంబ్లీలో గ్రామీణ వైద్య సేవల మెరుగుదలకు ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపాలని కోరుతూ, తన నియోజకవర్గంలో 35 గ్రామీణ వైద్య కేంద్రాల నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ రాయదుర్గం సీహెచ్‌సీ పనులు నిలిచిపోయాయని గుర్తుచేశారు. దర్గా హోన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతులు, పరికరాలు, క్వార్టర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా, మంత్రి సత్యకుమార్ అవసరమైన చర్యలు తీసుకుం
గ్రామీణ వైద్య సేవల మెరుగుదలకు ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపాలి: కాలవ శ్రీనివాసులు రాయదుర్గం: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపాలని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రాష్ట్ర అసెంబ్లీలో గురువారం కోరారు. తన నియోజకవర్గంలోని వైద్య సదుపాయాల పరిస్థితిపై సభలో మాట్లాడారు.
రాయదుర్గం నియోజకవర్గంలో 35 గ్రామీణ వైద్య కేంద్రాల భవన నిర్మాణాలకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అధిక నిధులు తీసుకురావడంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని కాలవ శ్రీనివాసులు అభినందించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి