రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపును తప్పులేకుండా, పారదర్శకంగా నిర్వహించాలని డీఆర్‌ఓ మల్లికార్జునుడు అధికారులకు ఆదేశించారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 5 వరకు ఇంటింటి సర్వే, ముసాయిదా జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, గ్రామ సభల ధ్రువీకరణ దశలతో తుది ఓటర్ల జాబితాను పూర్తి చేయాలని సూచించారు.
ఓటర్ల గుర్తింపు పారదర్శకంగా చేపట్టాలి: డీఆర్‌ఓ మల్లికార్జునుడు కడప: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) కె. మల్లికార్జునుడు సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌ఓ ఛాంబర్‌లో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ZPP CEO సుబ్రహ్మణ్యం, DPO రామచంద్ర, మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు హాజరయ్యారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి