రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
స్మార్ట్ మీటర్ల అమలుతో తమ ఉపాధికి ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కార్యాచరణ కమిటీ ప్రతినిధులు, ప్రొద్దుటూరులో స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న మీటర్ రీడర్లకు విద్యుత్ సంస్థల్లోనే శాశ్వత ఉద్యోగాలు, Field Assistant, Watchman, Driver వంటి పోస్టుల్లో అవకాశాలు కల్పించి ఉద్యోగ భద్రతను నిర్ధారించాలని వారు ప్ర
విద్యుత్ సంస్థల్లోనే ఉద్యోగ భద్రత కల్పించాలని మీటర్ రీడర్ల విజ్ఞప్తి ప్రొద్దుటూరు: విద్యుత్ మీటర్ రీడర్లకు విద్యుత్ సంస్థల్లోనే శాశ్వత ఉద్యోగాలు కల్పించి, పూర్తి స్థాయి ఉద్యోగ భద్రతను నిర్ధారించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కార్యాచరణ కమిటీ ప్రతినిధులు స్థానిక శాసనసభ్యునికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు తమ సమస్యలు, డిమాండ్లను ఎమ్మెల్యేకు వివరించారు.
తమ నియోజకవర్గ పరిధిలో అనేక సంవత్సరాలుగా విద్యుత్ మీటర్ రీడర్లుగా నమ్మకంగా సేవలు అందిస్తున్నామని మీటర్ రీడర్లు ఎమ్మెల్యేకు తెలిపారు. ప్రతి నెల ఇంటింటికీ తిరిగి మీటర్ రీడింగులు తీసి, వినియోగదారులకు విద్యుత్ బిల్లులు అందజేస్తూ, ఇటు ప్రజలకు, అటు విద్యుత్ సంస్థలకు నిరంతర సేవలు అందిస్తున్నామని వారు పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి