రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్
పాముకాటు చికిత్సపై సోషల్ మీడియాలో వస్తున్న “ఇంటికే వచ్చి 108 సిబ్బంది ఇంజెక్షన్ వేస్తారు” అనే ప్రచారం అసత్యమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 108 అంబులెన్స్‌లలో యాంటీ స్నేక్ వెనం ఇంజెక్షన్ అందుబాటులో ఉన్నా, అది ప్రయాణంలో రోగి పరిస్థితి అత్యవసరంగా మారినప్పుడు మాత్రమే, వైద్యుల పర్యవేక్షణలో EMT ద్వారా ఇస్తారని అధికారులు తెలిపారు.
పాముకాటు చికిత్సపై సోషల్ మీడియాలో అపోహలు: ఇంటికే వచ్చి ఇంజెక్షన్ వేయరు పాముకాటు చికిత్సకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. “పాము కాటు వేయగానే 108 వాహనానికి కాల్ చేస్తే, వారు నేరుగా ఇంటికే వచ్చి ఇంజెక్షన్ ఇస్తారు” అంటూ ఒక పోస్ట్ విస్తృతంగా షేర్ అవుతోంది.
ఈ వైరల్ పోస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. అందులోని వాస్తవాలను వివరించడంతో పాటు, ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకావద్దని విజ్ఞప్తి చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి