రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు రాత్రివేళల్లో విజిబుల్ పోలీసింగ్, బీట్ గస్తీ, ప్రత్యేక పెట్రోలింగ్, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్, చోరీలు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మహిళలు–చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ, భద్రతాభావం పెంపు లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో రాత్రి విజిబుల్ పోలీసింగ్– ప్రజల భద్రతే లక్ష్యం శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.
సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా రాత్రివేళల్లో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత కోసం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విజిబుల్ పోలీసింగ్, బీట్ గస్తీ, ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తూ నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలపై నిరంతర నిఘా కొనసాగించార
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి