రాయలసీమ న్యూస్ - తిరుపతి

శ్రీకాళహస్తిలో ఆటో డ్రైవర్లకు స్కానర్ గుర్తింపు కార్డులు

శ్రీకాళహస్తి పట్టణంలో ప్రయాణికుల భద్రతను పెంచేందుకు ఆటో డ్రైవర్లకు స్కానర్‌తో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డులను పోలీసు శాఖ అందజేసింది. ఈ కార్డుల ద్వారా ప్రయాణికులు డ్రైవర్ వివరాలను వెంటనే పరిశీలించుకునే అవకాశం ఉండడంతో పారదర్శకత, భద్రత పెరుగుతాయని డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు.

ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, వృద్ధులకు ఇది మరింత భద్రత కల్పించే చర్యగా పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో ఆటో డ్రైవర్లకు స్కానర్ గుర్తింపు కార్డులు శ్రీకాళహస్తి పట్టణంలో ప్రయాణికుల భద్రతను బలోపేతం చేయడానికి పోలీసు శాఖ కొత్త చర్యలు చేపట్టింది.

స్థానిక బేరివారి మండపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు స్కానర్‌తో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డులను డీఎస్పీ నరసింహమూర్తి అందజేశారు. ఆటోల్లో ప్రయాణించే సమయంలో ప్రయాణికులకు డ్రైవర్‌పై ఏదైనా అనుమానం కలిగినా, డ్రైవర్ ప్రవర్తన సక్రమంగా లేకపోయినా గుర్తింపు కార్డుపై ఉన్న స్కానర్‌ను ఉపయోగించి డ్రైవర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →