రాయలసీమ న్యూస్ - నంద్యాల
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాలైన ఆల్మట్టి, నారాయణ్ పూర్, జూరాల నుంచి భారీ వరదనీరు చేరడంతో నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 869.20 అడుగులు, నిల్వ 138.2730 టీఎంసీలుగా ఉండగా, ఇన్ ఫ్లో 2,20,948 క్యూసెక్కులుగా నమోదైంది.
ఇదే స్థితి కొనసాగితే వారం రోజుల్లో జలాశయం పూర్తిస్థాయికి చేరుకునే అవకాశం ఉండగా, ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి 24 గంటల్లో 3.435 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. శ్రీశైలం జలాశయానికి వరదనీరు పెరుగుదల గంటగంటకూ నీటిమట్టం ఎగసి పడుతోంది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉదృతి పెరగడంతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.
దీంతో జలాశయం నీటిమట్టం గంటగంటకూ పెరుగుతున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపారు. ఆల్మట్టి, నారాయణ్ పూర్, జూరాల వంటి ఎగువ జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి