రాయలసీమ న్యూస్ - నంద్యాల
శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు, కుంకుమార్చనలను మూడు రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేశారు. సాధారణ భక్తులందరికీ అలంకార దర్శనానికి ప్రాధాన్యం ఇస్తుండగా, ప్రోటోకాల్ సిఫార్సుతో వచ్చే వారికి రాత్రి 8.30 తర్వాత మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు.
క్యూలైన్లలో భక్తులకు అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు వంటి సౌకర్యాలు అందించే ఏర్పాట్లు చేశారు. శ్రీశైలంలో శ్రావణ సోమవారం సందడి శ్రీశైలం: శ్రావణమాసం, అదీ సోమవారం కావడంతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
తెల్లవారుజామున నుంచే దేశం నలుమూలల నుంచి భక్తులు మహాక్షేత్రానికి తరలివచ్చి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల పెరిగిన రద్దీ దృష్ట్యా సాధారణ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు, కుంకుమార్చనలను తాత్కాలికంగా నిలిపివేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి