రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడపలో త్వరలో ప్రారంభమయ్యే "స్టార్టప్ కడప" ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ ద్వారా జిల్లా యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
భవనం నిర్మాణం దాదాపు పూర్తికావడంతో, నాణ్యతకు రాజీ లేకుండా మిగతా పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ కేంద్రం ద్వారా స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు అవసరమైన మార్గదర్శకత్వం, సదుపాయాలు ఒకే వేదికపై లభించనున్నాయి.
త్వరలో ప్రారంభానికి సిద్ధమైన "స్టార్టప్ కడప " ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ జిల్లా యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ, సరికొత్త ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలకు వేదికగా రూపుదిద్దుకుంటున్న "స్టార్టప్ కడప" ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి