రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
పొట్లదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ‘నశాముక్త్ భారత్ అభియాన్’ అవగాహన కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులకు వ్యసనాల దుష్పరిణామాలు వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యంతో వ్యసన రహిత జీవనానికి ప్రతిజ్ఞ చేయించి, రాజయోగ ధ్యానం నిర్వహించారు.
మత్తు పదార్థాలు, చెడు అలవాట్లు, సెల్ ఫోన్, టీవీకి అతిగా అలవాటు కాకుండా స్వీయ క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఉపన్యాసకులు సూచించారు. మత్తు పదార్థాలకు విద్యార్థులు నో: బ్రహ్మకుమారీస్ సూచన ఎర్రగుంట్ల: మాదకద్రవ్యాలు, వ్యసనాల నుంచి దూరంగా ఉండి విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు సూచించారు.
పొట్లదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ‘నశాముక్త్ భారత్ అభియాన్’ (వ్యసన ముక్త భారత ప్రచారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యసనాల దుష్పరిణామాలపై వివరణ ఇచ్చి, మంచి అలవాట్లను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని నిర్వాహకులు వివరించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి