రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు AHTU ఆధ్వర్యంలో కడప నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో మానవ అక్రమ రవాణా, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. శక్తి యాప్, 112, 1930 హెల్ప్‌లైన్ వినియోగం, సోషల్ మీడియా అప్రమత్తత, మహిళల హక్కులు, ప్రభుత్వ రక్షణ సేవలపై అధికారులు విద్యార్థినులకు సూచనలు ఇచ్చి, ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
మానవ అక్రమ రవాణా, మహిళల భద్రతపై విద్యార్థినులకు అవగాహన వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు జిల్లా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఆధ్వర్యంలో గురువారం కడప నగరంలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జులై 30 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా ప్రత్యేకంగా విద్యార్థినుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశ
సదస్సులో మానవ అక్రమ రవాణా, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మహిళల రక్షణకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు, శక్తి యాప్ వినియోగం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లపై విస్తృతంగా అవగాహన కల్పించారు. కార్యక్రమానికి సుమారు 250 మందికి పైగా విద్యార్థినులు హాజరై పోలీసు అధికారులు, ఇతర విభాగాల ప్రతినిధులు అందించిన సూచనలు, అవగాహన సందేశాలను ఆసక్తిగా విన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి