రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్
సుప్రీం కోర్ట్ జర్నలిస్టులపై నిజాలను వెలుగులోకి తీసుకువచ్చినందుకు మాత్రమే కక్ష్యతో కేసులు పెట్టడం చెల్లదని స్పష్టం చేసింది. శాటిలైట్ ఛానెల్స్, YouTube, ప్రింట్ మీడియా జర్నలిస్టుల పనికి సంబంధించిన వివాదాలు ముందుగా జర్నలిస్టు సంఘాల ద్వారా పరిష్కరించాలని, వాటిని పక్కన పెట్టి నేరుగా అక్రమ కేసులు నమోదు చేసే వారిపై, పోలీసులపై చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది.
జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టరాదు: సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు ఢిల్లీ: దేశవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు సంబంధించి సుప్రీం కోర్ట్ ముఖ్యమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పెన్ను పట్టి వార్తలు రాసే వారు, వీడియో కెమెరా పట్టి న్యూస్ ప్రసారాలు చేసే వారు అందరూ జర్నలిస్టులేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
రోజువారీ వార్తా ప్రసారాలు, నివేదికలు తయారు చేసే వారిని జర్నలిస్టులుగా గుర్తించాల్సిందేనని సూచించినట్లు వివరాలు చెబుతున్నాయి. రాజకీయ నాయకులు, అక్రమ సంపాదన దందాల్లో పాల్గొనే వారు, వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడే వారి బాగోతాలను బయటపెట్టే వార్తలు, న్యూస్ ప్రసారాలు చేసినందుకు మాత్రమే జర్నలిస్టులపై కావాలనే కక్ష్యతో కేసులు పెట్టడం సమంజసం కాదని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసినట్లు సమాచారం.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి