రాయలసీమ న్యూస్ - తిరుపతి

స్వర్ణముఖి నదిలో క్షుద్ర పూజల ప్రచారం అసత్యం: నాయుడుపేట పోలీసుల స్పష్టీకరణ

తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్వర్ణముఖి నదిలో క్షుద్ర పూజలు జరిగాయన్న సోషల్ మీడియా ప్రచారం అసత్యమని పోలీసులు దర్యాప్తు అనంతరం స్పష్టం చేశారు. చెన్నైకి చెందిన వ్యక్తి అనారోగ్య కారణంగా మూఢనమ్మకాలతో దిష్టి పూజ మాత్రమే నిర్వహించారని, క్షుద్ర పూజలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు.

నిర్ధారణ లేని వదంతులను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. స్వర్ణముఖి నదిలో క్షుద్ర పూజల ప్రచారం అసత్యం: నాయుడుపేట పోలీసుల స్పష్టీకరణ తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని స్వర్ణముఖి నదిలో క్షుద్ర పూజలు నిర్వహించారన్న సోషల్ మీడియా ప్రచారంలో వాస్తవం లేదని నాయుడుపేట పోలీసులు స్పష్టం చేశారు.

ఆన్‌లైన్ వేదికల్లో వైరల్ అవుతున్న ఈ కథనంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి వివరాలు వెల్లడించారు. నాయుడుపేట బీడీ కాలనీ సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఆగస్టు 17వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో క్షుద్ర పూజలు జరిగాయంటూ కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారం ప్రారంభమైంది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →