రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

రాచమల్లు పై టీడీపీ నేత జబీవుల్ల తీవ్ర విమర్శలు

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్ల, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి పై భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు, భూసేకరణ, పేదల భూముల కబ్జాలు, కమిషన్ల ఆరోపణలతో తీవ్ర విమర్శలు చేశారు. రాజా ఫౌండేషన్ అధినేత హత్య, నందం సుబ్బయ్య హత్య కేసుల్లో అధికార బలం ఉపయోగించి పేర్లు తప్పించుకున్నారని ఆరోపిస్తూ, రేపటి నుండి రాచమల్లు అవినీతి చిట్టాను ఆధారాలతో బయటపెడతానని జబీవుల్ల హెచ్చరించారు.

రాచమల్లు పై టీడీపీ నేత జబీవుల్ల తీవ్ర విమర్శలు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి పై టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్ల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు విషయంలో రాచమల్లు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు ప్రారంభం చంద్రబాబు హయాంలోనే జరిగిందని, భూసేకరణ సమయంలో రైతులతో ఫిర్యాదులు చేయించినది వైసీపీ ప్రభుత్వమేనని జబీవుల్ల ఆరోపించారు. “రేపో మాపో కడప స్టీల్ ప్లాంట్‌ను కూడా మేమే కట్టామని రాచమల్లు చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు” రాచమల్లు వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ జబీవుల్ల పై విధంగా స్పందించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →