రాయలసీమ న్యూస్ - చిత్తూరు
చిత్తూరు జిల్లా మూడవ అదనపు న్యాయమూర్తి పూతలపట్టు టిడిపి నేతలపై నమోదైన రెండు కేసులను గురువారం కొట్టివేశారు. 2021లో ధర్నా, వైయస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ శవయాత్ర ఘటనలపై వైసీపీ నేతల ఫిర్యాదుల మేరకు నమోదైన కేసుల్లో నేరం రుజువు కాలేదని కోర్టు తేల్చింది.
ఈ తీర్పులతో టిడిపి శ్రేణుల్లో ఉపశమనం నెలకొంది. పూతలపట్టు టిడిపి నేతలపై నమోదైన రెండు కేసులు కొట్టివేత పూతలపట్టు: పూతలపట్టు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులపై వైసీపీ నేతలు పెట్టిన రెండు కేసులను చిత్తూరు జిల్లా న్యాయస్థానం గురువారం కొట్టివేసింది.
నేరం రుజువు కాలేదన్న కారణంతో మూడవ అదనపు న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ 2021 సెప్టెంబర్ నెలలో పూతలపట్టు మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం జరిగింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి