రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుమలలో కాలీఫ్లవర్‌లో పురుగులు గుర్తించిన నేపథ్యంలో, భక్తుల ఆరోగ్య భద్రత కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కాలీఫ్లవర్ వంటకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే చైనీస్ వంటకాలపై నిషేధం అమల్లో ఉండగా, ఇప్పుడు గోబీ వంటకాలు కూడా అందుబాటులో ఉండవు.
పరిస్థితులు సాధారణం అయిన తర్వాత, నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణమైన కాలీఫ్లవర్‌ను మాత్రమే తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో కాలీఫ్లవర్ వంటకాలకు తాత్కాలిక బ్రేక్ తిరుమల కొండపై భక్తులకు అందించే ఆహారంలో కాలీఫ్లవర్ వంటకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది.
ఇటీవల కాలీఫ్లవర్‌లో పురుగులు గుర్తించిన నేపథ్యంలో, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమలలో రోజూ లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం చేరుతారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి