రాయలసీమ న్యూస్ - తిరుపతి

తిరుపతి జిల్లాలో డ్రగ్స్‌పై దండయాత్ర 2.0

తిరుపతి జిల్లా పోలీసు శాఖ “డ్రగ్స్‌పై దండయాత్ర 2.0” పేరుతో గంజాయి సహా మాదకద్రవ్యాల నిర్మూలనకు విస్తృత చర్యలు చేపడుతోంది. రేణిగుంట సబ్ డివిజన్‌లోని గాజులమాండ్యం ఇండస్ట్రియల్ ఏరియాలో POCL కంపెనీ కార్మికులపై నిర్వహించిన మెగా గంజాయి టెస్టింగ్‌లో 136 మంది పరీక్షించగా, ఎవరూ పాజిటివ్‌గా తేలలేదు.

యువత, కార్మికులను మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు నిఘా, తనిఖీలు, అవగాహన కార్యక్రమాలను పోలీసులు కొనసాగిస్తున్నారు. తిరుపతి జిల్లాలో డ్రగ్స్‌పై దండయాత్ర 2.0 తిరుపతి: యువత భవిష్యత్తును కాపాడేందుకు, మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ విస్తృత చర్యలు కొనసాగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లాలో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →