రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి జిల్లా పోలీసు ఆధ్వర్యంలో జ్యువెలరీ, పాన్ బ్రోకర్ దుకాణాల యజమానులతో భద్రతా చర్యలు, ఆస్తి నేరాల నివారణపై అవగాహన సమావేశం నిర్వహించారు. సీసీటీవీ కెమెరాలు, లావాదేవీల పూర్తి రికార్డులు, KYC ధృవీకరణ తప్పనిసరి చేయాలని, అనుమానాస్పద బంగారం, వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేసి, పోలీసులతో సమన్వయంగా పనిచేస్తామని దుకాణ యజమానులు హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లాలో జ్యువెలరీ, పాన్ బ్రోకర్ దుకాణాలకు భద్రతా ప్రమాణాలు తప్పనిసరి తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జ్యువెలరీ, పాన్ బ్రోకర్ (గోల్డ్ ప్లెడ్జ్) దుకాణాల యజమానులతో భద్రతా చర్యలు, ఆస్తి నేరాల నివారణ, పోలీసు-వ్యాపారుల సమన్వయంపై అవగాహన సమావేశం నిర్వహించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ ఆర్ల శ్రీనివాసులు పర్యవేక్షణలో ఈ సమావేశం ఈ రోజు సీసీఎస్ పోలీస్ స్టేషన్, తిరుపతిలో జరిగింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి