రాయలసీమ న్యూస్ - అనంతపురం
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన వడ్డె దళవాయి రమాదేవికి అనంతపురం జిల్లాలో వడ్డెర్లు, బీసీ సంఘాలు, తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సాధారణ వడ్డెర మహిళగా ఉన్న తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి, పార్టీ నాయకత్వానికి రమాదేవి కృతజ్ఞతలు తెలిపి, వడ్డెర, బీసీ వర్గాల సంక్షేమం కోసం శ్రమిస్తానని పేర్కొన్నారు.
వడ్డె దళవాయి రమాదేవికి అనంతపురంలో ఘన స్వాగతం అనంతపురం: గవర్నర్ కోటాలో ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్న నూతన ఎమ్మెల్సీ వడ్డె దళవాయి రమాదేవికి అనంతపురం జిల్లాలో ఘన స్వాగతం లభించింది. పదవి దక్కిన తర్వాత తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆమెకు వడ్డెర్లు, బీసీ సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంతో నీరాజనాలు పలికారు.
జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్సీ రమాదేవి ముందుగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, తన కుటుంబ సభ్యులతో కలిసి మార్గమధ్యంలోని సుంకులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనంతపురం తపోవనం జంక్షన్ వద్దకు చేరుకున్న ఆమెకు వడ్డెర కులస్థులు, బీసీ నాయకులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి