రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
దువ్వూరు సమీపంలోని పాత దువ్వూరులో శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సుజయల శీల, అర్చకులు భూమరాజు నరసింహయ్య తెలిపారు. Hindu Dharmaparirakshana Trust ఆలోచన మేరకు ప్రత్యేక వేదికపై ఉచితంగా జరిగే ఈ వ్రతానికి మహిళలు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలని, వ్రత సామగ్రిని ప్రతి ఒక్కరు తమవంతుగా తెచ్చుకోవాలని సూచించారు.
పాత దువ్వూరులో సామూహిక వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు దువ్వూరు: మండల కేంద్రమైన దువ్వూరు సమీపంలోని పాత దువ్వూరులో వెలసిన శ్రీ కోదండరామ స్వామి ఆలయ సన్నిధిలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సుజయల శీల, ఆలయ అర్చకులు భూమరాజు నరసింహయ్య తెలిపారు. ఆలయ అర్చకులు, ఆలయ ఈవో ఆధ్వర్యంలో ఈ సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.
శ్రావణమాసం శుద్ధ నవమి, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం శ్రీ వరలక్ష్మి వ్రతం నిర్వహించే ఆనవాయితీ ఉందని అర్చకులు వివరించారు. శ్రావణమాసంలో జరిగే శ్రీ వరలక్ష్మి వ్రతం అనాదిగా హిందూ మహిళలు నిర్వహించుకొనే విశేషమైన వ్రతమని, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా శ్రీ లక్ష్మీదేవిని ప్రార్థించుకొనే అతిముఖ్యమైన భక్తి కార్యక్రమమని వారు తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి