రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ఆగస్టు 29న విజయవాడ పీవీ సిద్ధార్థ కాలేజ్ ప్రాంగణంలో యంగ్ ఇండియన్స్ (Yi) అమరావతి చాప్టర్, CII ఆధ్వర్యంలో భారీ సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం జరుగనుంది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఒకే రోజు 75 వేలకుపైగా సీడ్ బాల్స్ తయారు చేసి నగర పరిసర ప్రాంతాల్లో విస్తరించి పచ్చదనం పెంపు, యువతలో సామాజిక బాధ్యతాభావం పెంచడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయవాడలో భారీ సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం: అతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి యంగ్ ఇండియన్స్ (Yi) అమరావతి సీడ్ బాల్స్ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈనెల 29న విజయవాడలోని పీవీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రాంగణంలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి యంగ్ ఇండియన్స్ (Yi) అమరావతి చాప్టర్ ప్రతినిధులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆహ్వానించారు. కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు వివరించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి