రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ఎస్ఐఆర్‌లో భాగంగా ఓటర్ల క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక క్యాంపెయిన్

ప్రొద్దుటూరు పట్టణంలో ఎస్ఐఆర్‌లో భాగంగా ఓటర్ల క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో రెండు విడతలుగా ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బీఎల్ఓ, బీఎల్ఏలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించి, సందేహాలు నివృత్తి చేస్తారని, అర్హులంతా Form-6, Form-8 ద్వారా తమ వివరాలు నమోదు, సవరణ చేసుకోవాలన

ఎస్ఐఆర్‌లో భాగంగా ఓటర్ల క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక క్యాంపెయిన్ ప్రొద్దుటూరు పట్టణంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం కింద ఓటర్ల క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ నెలలో రెండు విడతలుగా ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు కమీషనర్ & అసిస్టెంట్ ఎలక్టరల్ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వివరాలు వెల్లడించారు.

మొదటి విడత ప్రత్యేక క్యాంపెయిన్ ఈ నెల 22, 23 తేదీల్లో, రెండో విడత 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి చెందిన బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్ఓ) ఆయా కేంద్రానికి సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్ఏ)తో కలిసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉంటారని తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →