రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి రైతులు ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు ప్రారంభించే ముందు నీటి లభ్యతను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఎల్ నినో ప్రభావం, వర్షపాతం అనిశ్చితి, నీటి వనరుల పరిమితి నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వ్యవసాయ శాఖ సూచనలు, అధికారుల నివేదికలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే పంటల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశార
సాగుకు ముందే నీటి లభ్యతను పరిశీలించాలి: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు: రైతులు ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు ప్రారంభించే ముందు నీటి లభ్యతను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సూచించారు. ప్రొద్దుటూరు నెహ్రూ రోడ్డులోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రస్తుత సాగునీటి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది సాగునీటి పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులు ప్రధానంగా తాగునీటి అవసరాలకే సరిపోతున్నాయని, ఈ నేపథ్యంతో వ్యవసాయ రంగం ముందున్న సవాళ్లను రైతులు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి