నోయిడాలో భారీ అగ్నిప్రమాదం | హై రైజ్ అపార్ట్‌మెంట్‌లో మంటలు | AC పేలుడే కారణమా? | Breaking News
నోయిడా సెక్టార్-119లోని అరన్య సొసైటీ హై రైజ్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏసీ పేలుడు కారణంగా 21వ అంతస్తులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వెంటనే ఆరు ఫైర్ ఇంజిన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల అసలు కారణంపై విచారణ కొనసాగుతోంది.





