వాట్సప్ టికెట్లపై రైల్వే రెడ్‌కార్డ్: ఒరిజినల్ టికెట్ తప్పనిసరి
భారతీయ రైల్వే శాఖ వాట్సప్ ఫార్వర్డ్‌లు, స్క్రీన్‌షాట్ టికెట్లు ఇకపై చెల్లుబాటు కాదని, ఒరిజినల్ ఇ-టికెట్ లేదా ప్రింటెడ్ టికెట్ మాత్రమే టీటీఈలు అంగీకరిస్తారని స్పష్టం చేసింది. ఇలాంటి స్క్రీన్‌షాట్ టికెట్లు చూపితే టికెట్ లేని ప్రయాణంగా పరిగణించి కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సి ఉండి, జరిమానా, చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.