కేవైసీ పేరుతో మోసాలు పెరుగుదలపై RBI హెచ్చరిక
RBI ఆర్థిక విద్య కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచుతూ, ఫైనాన్సియల్ లిటరసీ వీక్ 2026ను “KYC - యువర్ ఫస్ట్ స్టెప్ టూ సేఫ్ బ్యాంకింగ్ ” అంశంతో ఫిబ్రవరి 9–13 వరకు నిర్వహిస్తోంది. KYC పేరుతో నకిలీ సందేశాలు, లింకుల ద్వారా జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, తొందరపడకుండా ఆలోచించి, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా OTP, PIN, పాస్‌వర్డ్ వంటి గోప్య వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని RBI సూచించింది.