బ్రేకింగ్ న్యూస్
Search

ప్రొద్దుటూరులో DSC దీక్ష రెండో రోజు | కడపలో వైద్య సేవలపై ఆకస్మిక తనిఖీలు | Rayalaseema News 07-08

ప్రొద్దుటూరులో DSC అక్రమాలపై రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. వైఎస్సార్ కడప జిల్లాలో వైద్య సేవలపై DMHO ఆకస్మిక తనిఖీలు — రాయలసీమ న్యూస్ బులెటిన్ 07-08-2026 | Telugu News | AP News

నేటి ముఖ్యాంశాలు:

ప్రొద్దుటూరులో DSC దీక్ష రెండో రోజు: ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ మెయిన్ గేట్ ఎదుట కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. DSC అక్రమాలపై CBI విచారణ, నిరుద్యోగ భృతి వంటి డిమాండ్లతో ఈ నిరసన కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి.

కడప జిల్లాలో వైద్య సేవలపై ఆకస్మిక తనిఖీలు: జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. పి. యుగంధర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సి.కె. దిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కొలుములపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లను సందర్శించి వైద్య సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణ, ఔషధాల నిల్వ, టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు.

ప్రొద్దుటూరులో ప్లాస్టిక్‌పై ప్రత్యేక డ్రైవ్: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు పురపాలక సంఘం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. మొత్తం 10 వేల షాపులను లక్ష్యంగా చేసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు.

పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు వీక్షించండి. మీ అభిప్రాయాన్ని Comment ద్వారా తెలియజేయండి.

సంబంధిత వార్తలు

మరిన్ని వీడియోలు

We Are Hiring – Anchors + Copywriters