
ప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు
ప్రొద్దుటూరు పట్టణంలో TNSF ఆధ్వర్యంలో నిర్వహించిన UG, PG విద్యార్థుల క్రికెట్ టోర్నమెంట్ నాలుగు రోజులపాటు విజయవంతంగా ముగిసింది. ఫైనల్‌లో ప్రొద్దటూరు వైవియూ ఇంజనీరింగ్ కాలేజీ జట్టు మొదటి బహుమతి, ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీ జట్టు ద్వితీయ బహుమతి సాధించగా, టీడీపీ నేతలు విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంట్ ద్వారా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, జట్టు భావన పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.


