ఆర్థిక రంగంలో వినియోగదారుల KYC రికార్డులను ఒకేచోట నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన సెంట్రల్ KYC రిజిస్ట్రీ (CKYCR) ద్వారా ఖాతా ప్రారంభ ప్రక్రియ మరింత సులభతరమవుతోంది. వినియోగదారుల KYC వివరాలను ఏకీకృతంగా భద్రపరచడం, ఒకసారి సమర్పించిన పత్రాలను మళ్లీ మళ్లీ ఇవ్వాల్సిన అవసరాన్ని తగ్గించడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం.

CKYCRలో ప్రతి వినియోగదారుకు ప్రత్యేకమైన 14 అంకెల CKYC నంబర్ కేటాయించబడుతుంది. ఈ CKYC నంబర్ ద్వారా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇప్పటికే నమోదైన KYC రికార్డులను పొందగలవు. దీంతో కొత్త బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో ఖాతా ప్రారంభించే సమయంలో అదే KYC పత్రాలను తిరిగి సమర్పించాల్సిన అవసరం తగ్గుతుంది.

సెంట్రల్ KYC రిజిస్ట్రీ లో ఉన్న KYC రికార్డులు ఆర్థిక రంగంలోని వివిధ సంస్థలకు పరస్పర వినియోగానికి అనుకూలంగా ఉంటాయి. ఏకరీతి KYC ప్రమాణాలతో ఈ రిజిస్ట్రీ పనిచేస్తుంది. వినియోగదారులు కొత్త బ్యాంకు, Non- బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీ , మ్యూచువల్ ఫండ్ , ఇన్సురంచె కంపెనీ వంటి ఆర్థిక సంస్థలతో సంబంధం ఏర్పరుచుకునే ప్రతిసారి KYC పత్రాలు సమర్పించి, ధృవీకరించించుకోవాల్సిన భారాన్ని తగ్గించడం ఈ వ్యవస్థ ఉద్దేశ్యం.

CKYC పోర్టల్‌లో ఇప్పుడు OVD ఆధారంగా లేదా CKYC నంబర్ ఆధారంగా bulk సెర్చ్ సౌకర్యం అందుబాటులో ఉంది. KYC రికార్డుతో సమర్పించిన ఆఫిసిఅల్య్ వలీద్ డాక్యుమెంట్ (OVD) వివరాలు లేదా CKYC నంబర్ ఆధారంగా ఒకేసారి అనేక రికార్డులను శోధించుకునే వీలును సెంట్రల్ KYC రిజిస్ట్రీ కల్పించింది. Bulk సెర్చ్ కోసం అవసరమైన ఫైల్ స్ట్రక్చర్ వివరాలు CKYC పోర్టల్‌లోని డౌన్లోడ్స్ విభాగంలో అందుబాటులో ఉన్నాయి.

రిపోర్టింగ్ ఇంటిటిఎస్ తమ సంస్థకు సంబంధించిన నోడల్ ఆఫీసర్ వివరాలను CKYC పోర్టల్‌లోని Contact Us విభాగంలో పరిశీలించి, అవి సక్రమంగా, తాజా సమాచారం ప్రకారం ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించబడింది. CKYC రికార్డ్స్ కు అనధికార ప్రాప్తి జరిగిన సందర్భాల్లో నివేదించడానికి అవసరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) కమ్యూనిక్యూ విభాగంలో రిపోర్టింగ్ ఇంటిటిఎస్ కోసం అప్లోడ్ చేయబడింది.

రిపోర్టింగ్ ఇంటిటిఎస్ తమ వినియోగదారుల KYC ఐడెంటీఫైర్ ను పాసుబుక్ , అకౌంట్ స్టేట్మెంట్ , మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ , ఇంటర్నెట్ బ్యాంకింగ్ , ఇన్సురంచె పాలసీ , Demat స్టేట్ మెంట్ వంటి పత్రాలు, సేవలపై ప్రదర్శించాల్సిందిగా కోరబడింది. CKYCRR 2.0తో API ద్వారా అనుసంధానం కోసం అవసరమైన API పత్రాలు డౌన్లోడ్స్ విభాగంలో, సంబంధిత నోటిఫికేషన్ లు నోటిఫికేషన్ విభాగంలో అందుబాటులో ఉన్నాయి.

వినియోగదారులు తమ CKYC నంబర్‌ను తెలుసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. తమ బ్యాంకును నేరుగా సంప్రదించడం ద్వారా CKYC నంబర్‌ను పొందవచ్చు. అదనంగా, 7799022129కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా CKYC నంబర్ వివరాలు పొందే సౌకర్యం కల్పించబడింది. అలాగే, https://ckycindia.in వెబ్‌సైట్‌ను సందర్శించి CKYC నంబర్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

CKYC, KYC ప్రక్రియ, వినియోగదారుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన మరింత సమాచారం కోసం Reserve Bank of India నిర్వహిస్తున్న https://rbikehtahai.rbi.org.in/telugu/index.html వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ పోర్టల్‌లో తెలుగు భాషలో వివరణాత్మక సమాచారం, అవగాహన సామగ్రి అందుబాటులో ఉంది.