TAG
#ప్రసాదం పంపిణీ
3 articles
TAG
3 articles

మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ కోసం హైదరాబాదు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు రాత్రి వరకు ప్రసాదం పంపిణీ కొనసాగుతుండగా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రోగులు, వారి సహాయకులకు మూడు రోజులపాటు వసతి, భోజనం, మంచినీళ్లు, ట్రాఫిక్, భద్రత, వైద్య సహాయాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
8, జూన్ 2026

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, రూట్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. నాంపల్లి, ఎంజే మార్కెట్, పుట్లీబౌలి, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లో వాహన రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో పార్కింగ్, ఆటో డ్రాప్ పాయింట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
7, జూన్ 2026

జూన్ 8 రాత్రి 9 గంటల నుంచి జూన్ 9 సాయంత్రం వరకు హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి లక్ష మందికి పైగా భక్తులు హాజరవుతారని, వారికి సరిపడేలా మూడు లక్షలకు పైగా చేపపిల్లలను సిద్ధం చేసి, మరిన్ని కౌంటర్లు, ప్రత్యేక మార్గదర్శకాలు, సదుపాయాలు కల్పించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
6, జూన్ 2026

