కర్నూలు కలెక్టరేట్ ఎదుట AISF, AIYF విద్యార్థి నాయకులు బుధవారం భారీ నిరసన చేపట్టారు.
కర్నూలు కలెక్టరేట్ ఎదుట AISF, AIYF విద్యార్థి నాయకులు బుధవారం భారీ నిరసన చేపట్టారు. పత్తికొండలో ఉన్న జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను కంబలపాడుకు తరలించే ప్రతిపాదనను వెంటనే విరమించుకుని, పత్తికొండలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అలాగే, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపిన విద్యార్థి, యోధ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు!





