రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో భాగంగా ప్రొద్దుటూరులోనూ బంద్ | Rayalaseema News | apnews
రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో భాగంగా ప్రొద్దుటూరులోనూ బంద్ ప్రభావం కనిపించింది! ABVP నాయకులు పిలుపునిచ్చిన విద్యార్థుల సమస్యల పరిష్కార బంద్‌కు మద్దతుగా ప్రొద్దుటూరులోని పలు ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు మూతపడ్డాయి.
విద్యార్థి సంఘ నాయకులు కళాశాలల వద్దకు చేరుకుని యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తూ తరగతులను నిలిపివేయించారు. విద్యాపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.





