బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మృతుడి

10 articles

డోన్ సమీపంలో రోడ్డు ప్రమాదం: యువకుడి మృతి
జిల్లా వార్తలు

డోన్ సమీపంలో రోడ్డు ప్రమాదం: యువకుడి మృతి

నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని అమకతాడు టోల్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డోన్‌కు చెందిన యువకుడు రసూల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతుడి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. రసూల్ మృతి ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపగా, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

7, ఆగ 2026

కడప వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
జిల్లా వార్తలు

కడప వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

కడప వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 7 రోడ్లు సర్కిల్ సమీపంలోని భాస్కర్ వైన్ షాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేగింది. గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో మృతుడి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నివేదిక, సీసీ కెమెరా దృశ్యాలు, స్థానికుల సమాచారంపై ఆధారపడి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

4, ఆగ 2026

కడప రిమ్స్ సమీప రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని మృతదేహం
జిల్లా వార్తలు

కడప రిమ్స్ సమీప రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని మృతదేహం

కడప పట్టణంలోని RIMS ఆస్పత్రి సమీప రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు మృతుడిని గిద్దలూరు ప్రాంతానికి చెందిన నేరెళ్ల చిన్నరామయ్యగా గుర్తించి, రెండు రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదమా, ఆత్మహత్యా, లేక ఇతర కారణాల వల్ల మరణించాడా అన్నది పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తు ద్వారా వెల్లడికానుంది.

3, ఆగ 2026

పీలేరు సర్వీసు రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
జిల్లా వార్తలు

పీలేరు సర్వీసు రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం కడప రోడ్డు హైవే పక్కన ఉన్న సర్వీసు రోడ్డులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గుర్తింపు పత్రాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు మృతుడి వివరాలు, మరణానికి గల కారణాలపై విచారణ ప్రారంభించి, పరిసర ప్రాంతాల్లో కనిపించకుండా పోయిన వారి వివరాలు సేకరిస్తూ, ప్రమాదమా, ఆత్మహత్యా, లేక ఇతర కారణమా అన్న కోణాల్లో సీసీ కెమెరా దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు.

27, జులై 2026

పహల్గాం దాడి ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌.. :  తోటలో నక్కి ఉండగా కాల్చిచంపిన సైన్యం
జాతీయం

పహల్గాం దాడి ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌.. : తోటలో నక్కి ఉండగా కాల్చిచంపిన సైన్యం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్‌ చేపట్టిన భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. షోపియాన్‌లో ఓ పండ్ల తోటలో నక్కిన ఉగ్రవాదుల్లో ఒకడిని బుధవారం హతమార్చాయి.

8, జులై 2026

వల్లూరు పెన్నా వంతెన కింద యువకుడి మృతదేహం
జిల్లా వార్తలు

వల్లూరు పెన్నా వంతెన కింద యువకుడి మృతదేహం

వల్లూరు పెన్నా వంతెన కింద తీవ్ర గాయాలతో యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆధార్ కార్డు ఆధారంగా అతడిని ఎర్రగుంట్ల క్రాంతి నగర్‌కు చెందిన దుంపలగట్టు వెంకటసుబ్బయ్యగా నిర్ధారించారు. వంతెనపై స్కూటీ, కింద నదిలో మృతదేహం లభించడంతో పైనుంచి పడి మరణించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఖచ్చితమైన కారణం వెలుగులోకి రావడానికి దర్యాప్తు కొనసాగుతోంది.

30, జూన్ 2026

మైదుకూరు మండలంలో రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని యువకుడు మృతి
జిల్లా వార్తలు

మైదుకూరు మండలంలో రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని యువకుడు మృతి

మైదుకూరు మండలంలోని జాండ్లవరం జాతీయ రహదారిపై సోమవారం ఉదయం బైక్ అదుపుతప్పి కిందపడటంతో గుర్తుతెలియని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాహనదారులు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండి ట్రాఫిక్ నియమాలు పాటించాలని పోలీసులు సూచించారు.

29, జూన్ 2026

అతిగా మద్యం సేవించి నాయి బ్రాహ్మణుడు మృతి
జిల్లా వార్తలు

అతిగా మద్యం సేవించి నాయి బ్రాహ్మణుడు మృతి

సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన నారాయణ అనే నాయి బ్రాహ్మణుడు గత ఐదు రోజులుగా అతిగా మద్యం సేవించడం వల్ల అకస్మాత్తుగా అస్వస్థతకు గురై, స్విమ్స్‌కు తరలించే క్రమంలో మదనపల్లె వద్ద మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, కుటుంబానికి ఏకైక ఆదారమైన నారాయణ మృతి పిల్లవంక కాలనీలో విషాదాన్ని మిగిల్చింది.

24, జూన్ 2026

సూరారంలో తీవ్ర ఉద్రిక్తత.. ప్రతీకార హత్యలు!
తెలంగాణ

సూరారంలో తీవ్ర ఉద్రిక్తత.. ప్రతీకార హత్యలు!

పాత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం ఓ యువకుడిని ఆటోతో ఢీకొట్టి నిన్న హత్య చేయగా.. అందుకు ప్రతీకారంగా మృతుడి బంధువులు అతని హత్యకు కారకుడైన వ్యక్తి తండ్రిని రాత్రి హత్య చేశారు.

23, జూన్ 2026

స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం బాధాకరం: బాధితులకు పరిహారం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
ఆంధ్రప్రదేశ్

స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం బాధాకరం: బాధితులకు పరిహారం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి పట్ల డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రతి మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు, ఒకరికి ఉద్యోగం, గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై ప్రత్యేక కమిటీతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండి, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

9, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters