రాయలసీమ న్యూస్, అనంతపురం:
అనంతపురంలో ‘ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎంప్లాయిస్ క్రికెట్ లీగ్’కు రంగు టీ షర్ట్ల ఆరంభం
అనంతపురం నగరంలోని జిల్లా వెటర్నన్స్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించిన కలర్ టీ షర్ట్ల ఆరంభోత్సవం జరిగింది. ఐపీఎల్ తరహాలో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌కు రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి లాంఛనంగా రంగు టీ షర్ట్‌లను ప్రారంభించి, ఉద్యోగుల క్రికెట్ జట్ల కెప్టెన్లకు అందజేశారు.
ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలో రురల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) స్థాపించి విద్య, వైద్య, క్రీడా రంగాల్లో జిల్లా ప్రజలకు విశేష సేవలు అందించిన శ్రీ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం నగరంలోని RDT క్రీడా మైదానంలో ఆంధ్రప్రదేశ్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో ‘ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎంప్లాయిస్ క్రికెట్ టోర్నమెంట్’ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యోగుల కోసం నిర్వహించే ఈ టోర్నమెంట్‌ను అక్టోబర్ 17న అనంతపురం నగరంలోని RDT మైదానంలో ప్రారంభించనున్నట్లు మచ్చా రామలింగారెడ్డి వివరించారు. ఈ ఏడాది టోర్నమెంట్ 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతుండగా, సిల్వర్ జూబ్లీ టోర్నమెంట్‌గా నిర్వహించడం విశేషమని ఆయన పేర్కొన్నారు. విన్సెంట్ ఫెర్రర్ పేరుతో ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్‌ను గత 25 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉద్యోగుల ఐక్యత, క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ఐపీఎల్ తరహాలో ‘ఎంప్లాయిస్ ప్రీమియర్ లీగ్ అనంతపురం’ పేరుతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు మచ్చా రామలింగారెడ్డి చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 30 డిపార్ట్మెంట్ల ఉద్యోగులు క్రికెట్ పట్ల ఆసక్తితో ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారని ఆయన వివరించారు.
కేవలం సెలవు దినాల్లోనే మ్యాచ్‌లు నిర్వహించేలా టోర్నమెంట్ షెడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొనడం అభినందనీయమని మచ్చా రామలింగారెడ్డి పేర్కొన్నారు. మొదటి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన, రెండో రోజు పోటీలు 18వ తేదీన RDT స్టేడియంలో జరగనున్నాయని ఆయన వివరించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి టోర్నమెంట్లో పాల్గొనే ఉద్యోగులకు రంగు టీ షర్ట్‌లను అందజేసినట్లు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. విజయరాజు, సభ్యులు వెంకట్, రఘు, ఎంప్లాయిస్ క్రికెట్ జట్టు కెప్టెన్లు జయరామ్ రెడ్డి, వర్ల శంకర్, మారుతి, సతీష్, రవి, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
టోర్నమెంట్‌కు సంబంధించిన నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. విజయరాజు (సెల్: 9490062555) సమన్వయం చేస్తున్నారు.













